మరదలు @మిరపతోటలో


మల్లెపువ్వు లాంటి నా మరదలు
ముట్టు కుంటే మాసి పోయేలా
పట్టుకుంటే జారిపోయేలా
మనసుకు దగ్గరయ్యేలా
ఎనకటి ఎంకిలా
మా చేలోని జొన్నకంకిలా
నెలవంకలా
నెరజాణ లా
నంగనాచి లా
సిగ్గు పడుతు నన్ను సూస్తుంటే
ముక్కుపుడకతో మూగబాసలు చేస్తుంటే
సొగసైన ఆ చిన్నదాని సోకులు చూస్తుంటే
నిఖార్సైన నిలువెత్తు బంగారం నడుస్తుంటే
వయ్యారాన్ని వాలు జడలో వాటేసుకుని వంగుతుంటే
ఆగలేని నా లోని బ్రహ్మచారి ఓ అడుగేసి
రంభ లాంటి ఆ పంబను చూసి
తాళలేని నా బాధకు తాళం వేసేశాడు
ఆడమ్మ మరదల మాయలో పడి
మడిగట్టు మీద మిరపకాయ మూటొదిలేశా

Advertisements

సంతలో సోకులాడి


సోకులాడి సైకాలాపింది
సైకులొదిలి నేను సున్నీ పట్టు కున్న
సోకులన్నీ సూపుతూ సుందరాంగి
సాయంత్రం వరకు సందులన్నీ తిప్పింది
సంతలో సేపలు సూసి సటుక్కున ఆగింది
సోయలేని నా సేతిలో సేపల సంచి ఎడితే
సేనాపతి లా ముందు నేను
సోవియట్ మా రాణిలా ఆమే నా వెనక
సప్పుడు సెయ్యకుంటా సల్లగా జారుతుంటే
సిల్క్ సీరలో దానక్క సింపాంగి లుక్కేసింది.
సాయంత్రం సూరీడు కి సాష్టాంగ నమస్కారం సేసి
సైకిలదగ్గిరికి సరుక్కున సేరుకున్నాను.
సోకులాడి సంతలో ఉందో, సల్లటీ గదిలో ఉందో
సోమేశ్వరా సైకిల్ ని కూడా పంక్చర్ సేసేశావా?

నీ ఙ్ఞాపకాలలో


image

నీ రూపం
ఙ్ఞాపకం

నిను తలుస్తున్నప్పుడు
నా మదిని నువ్వు తడుతున్నప్పుడు
మధుర ఙ్ఞాపకం.

నీ ముసిముసినవ్వులు
మన మరువలేని వెన్నెల రాత్రులు
మరో అద్భుతమైన ఙ్ఞాపకం

నా మనసు నీ మనసుతో
సింకయినపుడు
సిమ్ లేనప్పుడు
సరదాగా షేర్ చేసుకున్న ఆ విషయాలు
మరో సుందరమైన ఙ్ఞాపకం

మిణుగురుల మెరుపులు
మన మధ్య మిస్సవుతున్నప్పుడు
మసక మసక చీకటిలో
మోహన రాగం మన చెవులను తాకినపుడు
మనతో పాటు మరెవ్వరూ లేని ఆ క్షణాలు
ఓ సహజమైన ఙ్ఞాపకం

మొహమాటం పడే నీ మనసు
ముగ్గువలె సిగ్గు పడుతూ
మబ్బులు మాటున చంద్రుని మళ్ళే
బుంగమూతిలోని నీ బుగ్గల అందం
చిన్నగా చినబోతున్నప్పుడు
సన్నని చిరు గాలి మనసుల్ని తాకినపుడు
స్పర్శ లేని శరీరాలు సవ్వడి
ఓ మరువలేని తీపి ఙ్ఞాపకం

మెట్రో ట్రైన్లోను, మాల్స్లోను
మిరప తోటల్లోనూ, మోటారు షెడ్డు ల్లోనూ
మనదంటూ మనకంటూ
మినహాయింపు లేని మిగులు భూముల్లోనూ
జంటగా
కాలంతో పాటు కాదన్న పెద్దల మాటలను
ఆలోచిస్తూ అనుభవిస్తూ
భయపడుతూ,  బాధపడుతూ
ఒంటరిగా
గడిచిన జీవితం
ఓ భరించలేని ఙ్ఞాపకం

ఇన్ని ఙ్ఞాపకాలతో  ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినా
డక్వర్త్ లూయిస్ ప్రకారం విఫలమయ్యాను
ఇది మాత్రం మరుపురాని ఙ్ఞాపకం

స్నేహం….. మాటల్లో


జమాన నాటిది మన స్నేహం
జనాలకు తెలియనిది కాదు

తరతరాల మన బంధం
తెలియని వారెవ్వరు

ఇదేమిటో ఈ స్నేహం
ఇదెక్కడిదీ బంధం

మాటలకందని మన స్నేహం
మౌనం తో కొన్నాళ్ళు
మాటల్లో కొన్నేళ్లు

మలాలా ….. శాంతి కౌముది


malala

పాకిస్తాన్ తోటలో విరిసిన పారిజాత పుష్పానివి

స్వాట్ వేలిలో సన్నని విప్లవ క్రాంతివి

తాలిబాన్ల వేటలో చిక్కుకున్న జింక పిల్లవి

తండ్రి ఆశయాల రధసారధివి

వికసించిన చిన్నారి నవ్వుల మోము వి

రేపటి తరాల బాలికల స్వప్నానివి

టెర్రరిజం భావాలుకి సింగిణివి

ఉరికెత్తే ఆలోచనలకు ఆశావాదివి

మతోన్మాద భావలికి మావటివి

మిఠాయి మాటల తోటమాలివి

మెరుపుల మేరు రాణివి

బాల కార్మికుల చేయూతవి

బాలికిల జాతి రత్నాణివి

శాంతి విప్లవానికి చిహ్నణివి

అంధకారాన్ని అణగదొక్కిన అగ్నివి

అర్హులందరినీ ఆదుకున్న ఆగ్నస్ వి

మలాలా ….

మా అందరికి మనోధైర్యానివి

మా శక్తివి ,యువతకి స్పూర్తివి

నీ బాటలో .. నీ భావజాలలో

మేమంతా ముందుకు .. మరింత ఎత్తుకు

ఎదుగుతూ .. ఒదుగుతూ ..

నిరంతరం మజిలి లేని ప్రయాణం చేస్తాం

హుద్ హుద్ తుఫాన్ స్వార్ధం


Vizag

అమీ  తుమీ .. అడ్డు  ఆపు లేకున్నా
వాయు వేగాన్ని అధిగమించి
ఆకాశ హర్మ్యలును, ఆకాశాన్నంటె   చెట్లును
జల సంద్రం చేస్తు, జల దిగ్భందం  చేసి
జనాలును చెల్లా  చెదురు  చేసి భయబ్రాంతులు గురిచేసి
మట్టి కరిపించి, మనస్థాపానికి గురిచేసి
 మనోభావాలకు అతీతంగా
కొండలను పిండి చేసి , కొలువులేని రాజ్యం చేసి
అంధకారం లోకి  అణగద్రొక్కి
అశువులు బాసింప చేసి
జాలిలేని హృదయంతో
నిరాశా నిశ్ప్రుహలను కలుగచేసి
రైతన్న పంటలను పెంట చేసి
వణికిస్తూ , ఝలికిస్తూ,ఘీంకరిస్తూ
ప్రతి  సృష్టి  చేసి
ఘోరకలిని , గాడన్దాకరన్ని సృష్టించి
ఇంకేం మిగిల్చావ్  విశాఖనగరం లో
ఉక్కును తొక్కు చేశావ్ ..
విజయనగరం లో విధ్వంసం  చేశావ్ ..
సిక్కోలు సీమలో  సునామిని  గుర్తు చేశావ్
స్వార్థం  లేకుండా  సర్వం  నాశనం  చేశావ్

అబద్ధం ఆడలేక ……


Image

నీతో ప్రయాణం చెయ్యాలని …నిలువెత్తు అబధ్ధం ఆడాను….
కుదరుతుందో ..లేదో అని కంగారు పడ్డాను…
కాలం కలిసొస్తే…. నడిచొచ్చే కొడుకు కోసం…. కూసింత సంతోషం కోసం…
నా అబద్ధం నిజం కావాలని మరో అబద్ధం ఆడాను…
ఎన్ని అబద్ధాలాడిన melt కానీ ఆ మనుషుల మనసులు గురించి మనకెందుకు?
చివరి ప్రయత్నంగా మరో అబద్ధం ఆడాను.
అప్పుడు గానీ తెలియలేదు నువ్వింత నెరజాణవనీ….
అబద్ధం అంటే తెలియని నాతో ఎన్నో అబద్ధాలు చెప్పించావ్….
మరో అబద్ధం చెప్పే లోపే నా ప్రయాణానికి ticket ఇచ్చేసారు.
కొండ కోనల వెంట … నదీజలాలు వెంట .. ఇంకెల్లప్పూడు నీ వెంటే… అనీ
అబద్ధం ఆడలేని నా మనసు నిజం దాచిపెట్టింది…
ఇక నీతో నా ప్రయాణం శుభప్రదమగుగాక…..

ముందుకు సాగలేవా ?


నీ  అపజయాలు అధిగమించి
నీ  జయాల  స్పూర్తి తో
నిద్రలోని నీ  స్వప్నాల్ని
నిజం చేసే దారిలో
నువ్వెవరో తెలుసుకొని
నిన్నటి జ్ఞాపకాలతో, రేపటి ఆశల  తో
కరిగిపోయే కాలం  లో
అంతులేని ఆశల తో 
నిన్ను నువ్వు తెలుసుకొని

సాగిపోలేవా? ముందుకు సాగలేవా ?

నా క (వె) క (ర్రి)


Image

పాయసం లో పరమార్థం
పరమాన్నం లో పరమాతిర్థం
ఒక్కటేనా?
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి

బాదాం పిస్తా .. ధాన్యం బస్తా
కొట్టులో కొబ్బరుండ
ఒక్కటేనా?
మనిషికో వెర్రి మహిలో సుమతీ

బారులో బీరు… రోడ్డు మీద తారు
కర్రీలో కరివేపాకు
ఒక్కటేనా?
వెర్రి వెయ్యింతలు అంటే ఇదేనేమో ….!

మళ్లీ చూడనన్నావ్ ….


 

మనసు ఎలా ఒప్పింది అలా మాట్లానికి
కదలోద్దున్నావ్ కదలలే
బెదరోద్దున్నావ్ బెదర్లే
ఇంకేదో అన్నావ్ అదేదో చేశాను
‘నీ మొహం మండ ‘ అని తిట్టావ్
సెల్ ఫోన్ నేలకేసి కొట్టావ్
గుండెనంత గిల్లావ్
గొంతెమ్మ కోర్కెలు కోరావ్
ఏం కాదన్నని అలా అన్నావ్
మళ్లీ నా మొహం చూడనన్నావ్
వెధవ ఏటకారాలు ఎక్కువయ్యాయి
face book లో status లు తక్కువయ్యాయి
కోపం, తాపం, జాప్యంతో నువ్వు
చిరాకు, పరాకు, అరటాకు తో నేను
చెప్పక పొతే తెలిసేదెలా?
చెప్పెతే తప్పంతా నాదేల?
అస్సలు ఏం అన్నానని అలా అన్నావ్
మళ్లీ నా మొహం చూడనన్నావ్

 

చీకటి లో ఒక్కడినై….


నిన్ను సంధ్య వేళలో కలుద్దమనుకుంటే
ఉదయం చిన పోతుందేమో
ప్రతి క్షణం ….. ప్రతి ఘడియ
నీ వలపులో పడి పోయాను
నా దునియా మొత్తం నీవే
అన్నీ వదిలేసాను
సిగ్గు… లజ్జా…
అన్నీ నీ కోసమే
నా ప్రతి భావం లో నీవే
పగలు రాత్రి లాగా ,రాత్రి పగలు లా
చీకటి లో ఒక్కడినై
వెన్నెల్లో తడుస్తూ
నిన్ను చేరాలని
నీ తలపు వలపులలో…..
నిన్ను చూసిన
ఆ ఒక్క క్షణం
నే నెన్నడు మరువ లేను

వీడేంటి ఈ మధ్య………


 

వీడేంటి ఈ మధ్య
వింత వింత గా
వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు …
వెర్రి మొహంతో ….. వెధవ చూపులు
చూస్తున్నాడు
వెర్రి వెయ్యి విధాలని ….
ఉలిక్కి పడి….. వల వల గోల
పెడుతున్నాడు
వింత వింత గా వీడేంటి ఈ మధ్య
వనజాక్షి ఊహల్లో
వెధవ నవ్వు … వెధవ కోపం ..
వెర్రి నాయాల …..
ఎవరిని వలచితివి…
నీ మనసు చెరచితివి ….
వింత వింత గా వీడేంటి ఈ మధ్య

పలవిరింత పందిరిలో…..


నే వెతుకున్నది నాక్కానిపించనపుడు..
అలసి పోయి సొలసినపుడు
వీచే ఓ సన్నని గాలి నన్ను తాకినపుడు
నీ ప్రతి జ్ఞాపకం నా మది లో వస్తున్నప్పుడు
లోకమంతా చీకటి తో వున్నప్పుడు
ఆశల రెక్కలపై
ఊహ లోకలో నేను ఉగుతున్నప్పుడు
కలల లోకంలో విహరిస్తూ
కాలాన్ని అంచనా వేయలేక
కను రెప్పల మాటున నీ ప్రతిబింబం
జ్ఞాపకాలు కోసుకుంటూ
పలకలేని నా పెదవులపై
పలవిరింతైంది నీ పేరు ….

నా గూబలు గుయ్యమన్న వేళ


Image

పంచదార చిలకనన్ననా 
కుందనపు బొమ్మనన్ననా 
పొగిడా నా? తిట్టానా ? 
పొడుగు పళ్ళ సుందరీ
ఆవేశం తో చూస్తూ ,
ఆలోచనేం లేకుండా 
నీ అయిదు వేళ్ళ హస్త ముద్రిక 
నా గూబ మీద పడినపుడు 
కళ్ళల్లో నీరు నీరుగారినపుడు
బరువైన నా హ్రదయం బాధ తో 
బావురు మంటున్నప్పుడు
గుయ్య మంటున్న నా గూబలు కి 
ఏమి వినపడక …
కనపడే నీ కళ్ళలోని కన్నీరుకి
కారణం ఎవరు ?
నేనా ? నువ్వా ? 

మిక్చర్ పొట్లం లో ఏముంది ?


 

మిక్చర్ పొట్లం లో ఏముంది ?
తారల  ‘pose’ లు
Politicians మాయాజాలం
రంగస్థల రజతోత్సవాలు
క్రీడాకారుల కన్నీళ్ళు
బాపు, శ్రీధర్ ‘cartoon’ లు
SENSEX గీతలు
Share Market విలువులు
మావోస్టుల మరణాలు
ఒరిస్సాలో వరదలు
College లో  Acid దాడులు
హింసలు, ప్రతి హింసలు
Road ప్రమాదాలు, ప్రేమలేఖలు
దుర్మార్గాలు దారుణ పర్వాలు
కుంభ కోణాలు, కుంభ మేళాలు
బాల్య వివాహాలు , బాలికిలపై అత్యాచారాలు
ఇవి తప్ప ఇంకేం ఉంటాయి
ఆ మిక్చర్ పొట్లం లో
కావాలంటే తిన్నాక కాసేపు చూడు ….

మిక్చర్ పొట్లం లో ఏముంది ?

 

నాకు నచ్చాయి…..


Image

 

నాకు నచ్చాయి…..

నీ అదిరే ఆదరలలోని అమాయకత్వం 
నీ కురులలోని కొంటేతనం
నీ చూపులోని చురుకుదనం 
నీ మనసులోని మెత్తదనం 
నీ వలపులో ని వయసుతనం 
 
వలపు వన్నెల చిన్నారి 
ఇంకా బాగా నచ్చాయి 
నీ కవ్వింపుల కుర్రతనం 
నీ చిరునవ్వుల చమత్కారం 
నీ మాటల మోటుతనం
నీ అందాల అడంబరతనం 
 
చక్కని చిక్కని సుందరాంగి 
నాకు ఎంతో నచ్చాయి  
నీ పరికిణిల పడుచుతనం 
నీ నుదుట సింధూర ప్రతిబింబం 
నీ చిలపలుకుల మాధుర్యం 
నాకు నచ్చాయి 

మిత్రుని తో కొట్లాటలు …


 మిత్రుని తో కొట్లాటలు ...

 

మిత్రుని తో కొట్లాటలు …
మరువు లేని జ్ఞాపకాలు ..
గదిలో దెబ్బలాటలు ..
గడప దాటి వెళ్ళని వైనం ..
గడిచిన క్షణాలు …
గమ్యం లేని ప్రయాణాలు ..
గతం లో ..
అర్థం చేసుకోని మనసులు
అర్థం లేని మాటలు
ఎవరికీ వారే గొప్ప !
ఏం చేస్తే ఏం లాభం
వెధవ గోలల మధ్య వైరం
ఎవరికీ వారే యమునా తీరు..
ఎల్లలు లేని స్నేహాల మధ్య
ఎడమొహం పెడ బొబ్బలు
ఎన్ని వున్నా .. ఏం జరిగినా
కక్కుర్తి  మనసు లో
స్నేహం కోసం .. స్నేహితుడు కోసం
ఉబలాటం …

మల్లి సెమిస్టరు పరిచ్చలు


మల్లి సెమిస్టరు పరిచ్చలు

మామ మరిచావో మరి జాగ్రత్త 

మల్లి సెమిస్టరు పరిచ్చలు
గోంగూర పచ్చడి తిని 
గుర్రు పెట్టి నిద్రపోయావో 
మరి జాగ్రత్త 
జాగారం చెయ్యాలి నాలుగు రోజులు 
నాలుగు సిగరెట్లు  మూడు Half లు 
రెడీ చెయ్యలా?
మైక్రో స్లిప్పులు మాటేమిటి 
మసక ఎలురుతులో 
మల్లి మల్లి తిరుగుతావేంటి ?
cell phone లో సొల్లు కబుర్లాపి 
సమ్మగా కూర్చొని సదవరా
సాయంకాలం సినిమా చూసి మల్లి చదువాదం
మామ మరిచావో మరి జాగ్రత్త 

మల్లి సెమిస్టరు పరిచ్చలు
అత్తెసరు మార్కులు మనకలవాటే 
బిత్తరు చూపులు అలవాటే 
Tonic writer టక టకా చదివేద్దం..
Vikram series విరేచేద్దాం..
railway station లో టీ రెండప్పుడు 
కాంటీన్ లో కప్పు కాఫీ  పదప్పుడు
నిద్దర మొహం తో exam 
నిండు సున్నాలు లేకున్నా మార్కులు 
మామ మరిచావో మరి జాగ్రత్త 

మల్లి సెమిస్టరు పరిచ్చలు
 

మా వూరి నెరజాణ…… నా నీరజాక్షి ..


మా వూరి నెరజాణ...... నా నీరజాక్షి ..

 

మా వూరి నెరజాణ…… నా నీరజాక్షి ..
బుంగ మూతి నంగ నాచి

చీర కొని సినిమా తీసుకెళ్లా
అప్పుడప్పుడు ice క్రీం
కోరిందేది కాదనలేదు కోకిలమ్మకి

సింగల్ ఫోటో ,కవర్ ఫోటో  మే మిద్దరం కలిసి
రామ కృష్ణా ఫోటో స్టూడియో లో
ఆటో లో ఆరు కిలోమీటర్లు ప్రయాణం
కాజా కొట్టు దుర్గా రావు కి తెలుసు ,
‘అప్సర’ హాల్లో సినిమా చూసామని
కర్రి పిల్ల ‘కామాక్షి’ తెలుసు ‘
మేమిద్దరం జంప్  అని
మొద్దు మొహం ..
ముద్దు మురిపాలు లేవు ..
కొట్లాటలు .. కాళ్ళ బేరాలు ..
కాక పొతే కాంతమ్మ తో కబుర్లు

కలర్ టివి ముందు కన్ను కొట్టడం
కాపు తోటలో కలుసుకోవడం
సదా మాములే ..
పాల కోసం , పంచదార కోసం
పులుసు కోసం , పెరుగు కోసం
పదే పదే రావడం .. పడి పడి నవ్వడం.

నిరంతర సంచారి …


నిరంతర సంచారి ..

నిరంతర సంచారి …

మనసున్న చోట మజిలి
పక్షే  నీకు తోడూ
మేఘాల మేడలో
ఇంద్ర ధనుస్సు పల్లకిలో
దారిలో  తుమ్మేదేలెన్నో
తెరచాటు చెలి
చల్లని మనసు తో
పసందైన పాటలతో
మెల్లగా దరి చేరగా
కోరికలన్నీ హం పట్
నింగి లోనీ అందాలూ
నీ మనసులో మాటలు
మెరుపైన  తలపులు
సరదాల సరిగమలు
వయ్యారాల  సిన్ని
పక్కన చేరగా
గొడవలన్నీ గోల్ మాల్

జ్ఞాపకాలు


Image

నా చెలి కన్నులలో 

కనిపించే, కవ్వించే 
మధురిమ పదనిసలు 
వెన్నెలలో వెలేగే చిరు చిరు దివ్వెలు 
ఆనందిస్తున్నాను ప్రతి సారి 
కనిపించని ఆమె కోసం కదలాడాయి నా కన్నులు 
కలిగే సుతిమెత్తని కవ్వింత 
తోలిచాయి నా దివి సీమ
 
ఎగసే ఆమెలోని ఆనందం 
తొలకరి చినుకుల జ్ఞాపకం 
మిగిల్చిన ఆమె జ్ఞాపకాల వరవడి 
సరి దిద్దాయి నా కలవిరంతలు
నడిచేటప్పుడు ఆమె ఒయలు 
గుర్తు చేస్తాయి మా దురాన్ని 
ఓపికతో తన కోసం 
ఇంకేన్నాల్లో..
 
-గిజిగాడు , November 14 2006, 3:15

మరదల పిల్లా…


మరదల పిల్లా...

 

మరదల పిల్లా…

మనసు విప్పి అడిగా
మనువాడమని
మూతి విరుపులు , సొట్ట బుగ్గలు
చాలులే …
వన్నె చిన్నెల చిన్నారికి
కోపం లావై .. కనికరం తరిగి
చిరాకు పరాకు లతో
మిరియాలు నూరి
మిడిసి పడడం
అపులే ..
గాజులు కొన్న నికిద్దామని
గలాటా చేసావు .
చీరాలిద్దమనుకున్న
చిరాకు తో నువ్వు
తిమ్మిరి పాటు, తొందర పాటు
మానులే…
మరదలు పిల్ల
మల్లి మల్లి నువ్వు
మదిలో ..
మాములు విషయం కాదు
మరదలు పిల్ల
అందుకే అడిగా
మనసుతో  మనువాడమని

ఇంత లోకం …. వింత పోకడ


దారిద్ర్యం వెన్ను తడితే...

ఇంత లోకం …. వింత పోకడ

నిన్నటి జ్ఞాపకాలు … రేపటి ఆశయాలు
కదలక , మెదలక
తనివి తీరక
బాహ్య బంధాల తో
బతుకు చితి లో
ముక్కుతూ , మూలుగుతూ
జాడలేని    నీడ కోసం
పరిగెడుతూ , పరితపిస్తూ
అలసి పోయి , సొలసి పోయి
అణువణువునా అసువులుతో
పరుషమైన మాటలు
ఎర్ర రంగు జ్ఞాపకాలు
ఎదురు నిలుస్తూ, ఎండగడుతూ
ఉప్పెనలా చప్పున ఎగురుతూ
వాళ్ళంతా ద్రోహులు , వెన్నంటే ఉంటారు
వెక్కి వెక్కి ఏడుస్తారు .
ఆదమరిచావా .. అంతే
ఆక్రమిస్తారు అవధులు లేకుండా ..!
కన్నెర్ర చేస్తారు.
నిజం తెలుసుకొని నివ్వెర పోతారు
నిన్ను నిన్ను గా చూడలేక
నిన్నొక మాట , మొన్నొక మాట
మాటలతో మాయల గారడి చేస్తూ
మట్టు పెట్టి మంట కలుపుతారు
దారిద్ర్యం వెన్ను తడితే
భవితవ్యం భంగ పడితే
ఆలోచనల ఆశాసౌధం
కుప్పకూలి నేలకోరిగితే
చూసేవారు కొందరు
ఏడ్చేవారు కొందరు
నవ్వేవారు అందరూ
నీ కోసం ఓ నిట్టూర్పు..ఓ ఓదార్పు
విరిచేదేవ్వారు .. తెలిపెదేవ్వారు
నిశిద రాత్రి లో nI గమ్యం .. నిలిపెదేవ్వరు?
ధై ర్యే సాహసే లక్ష్మి
కొండ శిఖరం కోరికై
బ్రహ్మ రధం బ్రతుకై
నచ్చినట్లు ఉదయంచు
సింధూరపు సూర్యుడుల
ఇంత లోకం …. వింత పోకడ

నిన్నటి జ్ఞాపకాలు … రేపటి ఆశయాలు

ఓ కొంటె పిల్ల ….


something something నా వంట్లో .. Nothing Nothing ఆమె కంట్లో

మా ఇంటి డాబా మీద

ఓ కొంటె పిల్ల
జల్లెడెట్టి చూసా
జత కట్టాలని ..
తెల్ల తోలు పిల్ల… నిన్ను చూస్తే
నా మనసు గుల్ల గుల్ల
దగ్గరికి పోయి చూసా
దగ్గరవ్వాలని …
దమయంతి లా ఉన్న పిల్ల
దరహాసం చేస్తూ దగ్గరవుతుంటే
ధగ ధగ మెరుపులు … ఆకాశం లో
భగ.. భగ మంటలు … నా గుండెలో
సూరీడు చినబోయి .. చూస్తుంటే
something something నా ఒంట్లో
Nothing Nothing  ఆమె కంట్లో
మలయాళ featuresఉన్న  పిల్ల
అరవం  లో అరిచేసరికి
దండం తో దానయ్య
దగ్గుతూ దరికి వస్తుంటే
దొంగలాగా బెంగతో
మింగలేక మిటకలతో
miss అయ్యాను …

ఉత్తరాలోతో ఊసులు ….


ఉత్తరాలు తో ఉసులు ..

ఉత్తరాలోతో ఊసులు ….

ఈమెయిలు లో ఈలలు …
మొన్నీమధ్య  break up
 లేకపోతేనా ….
ప్రోద్దేరగని భిక్ష గాడిల
పదే పదే పలవరింపు ..
coffee bar  కలవిరంతలు
Coca cola  కవ్వింపులు ..
భలే భలే ముచ్చట్లు
గిలి గిలి  గిలిగింతలు …
బస్సుల్లో కస్సు బస్సులు .
Bike లో బారు ప్రయాణాలు ..
బాబాయ్ చూసాడు …. ఇంకేముంది ..
ఇంట్లో గోల …. ఒంట్లో దూల ..
కందిరీగల గోల … దూల గుండు దూల
గిర గిర … బర… బర … ఒర … ఒర ..
హరి ఓం హర ..హర…